కిరణ్ అబ్బవరం “మీటర్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం!

Published on Mar 29, 2023 12:25 am IST


టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా డైరెక్టర్ రమేష్ కాడురి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మీటర్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చెర్రీ, హేమలత లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ను ఏప్రిల్ 7, 2023 న థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

మీటర్ ట్రైలర్ ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది. హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో రేపు ఉదయం 10 గంటలకు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు తెలిపారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :