కిరణ్ అబ్బవరం మరో మూవీపై లేటెస్ట్ అప్డేట్..!

Published on Feb 21, 2022 8:12 pm IST

“రాజావారు రాణిగారు” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత “ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం” చేశాడు. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్‌ని ఇవ్వడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు కిరణ్ అబ్బవరం. అయితే ఈ యంగ్ టాలెంటెడ్ హీరో తాజాగా నటించిన “సెబాస్టియ‌న్ పి.సి. 524” చిత్రం మార్చి 4న విడుదల కాబోతుండగా, ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉంటే కిరణ్ ఐదో చిత్రాన్ని కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై మేకర్స్ ఓ అప్డేట్‌ని అందించారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ నెల 23న వెల్లడించబోతున్నట్టు తెలిపారు. కుటుంబ కథా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్ సరసన సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్టుండగా, కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :