కిరణ్ అబ్బవరం మూవీ కి రెండో రోజు సూపర్ డిమాండ్!

Published on Feb 19, 2023 7:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త విడుదల వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మల్టీ జానర్ చిత్రంలో కశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించింది. తాజా వార్త ఏంటంటే, ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు బుకింగ్స్ ఎక్కువయ్యాయి.

ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చడంతో కలెక్షన్స్‌లో కూడా అదే కనిపిస్తోంది. ఈ సినిమాకి డిమాండ్ గట్టిగానే ఉంది. మురళీ శర్మ, శుభలేక సుధాకర్, ప్రవీణ్ ఈ సినిమా లో కీలక పాత్రలు పోషించారు. GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ ఈ సినిమా కి సమర్పకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :