ఆహా వీడియో లో 100 మిలియన్స్ తో దూసుకు పోతున్న “వినరో భాగ్యము విష్ణుకథ”

Published on Mar 24, 2023 5:44 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వినరో భాగ్యము విష్ణుకథ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సైతం ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం ఆహా వీడియో లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆహా వీడియో లో ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం లో కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటించారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :