ఎన్టీఆర్ కోసం ఆసక్తికరమైన టైటిల్ రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్ ?

kalyan-ram
వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్ల తరువాత జూ. ఎన్టీఆర్ బాగా ఆలోచించి మరీ దర్శకుడు బాబీతో ప్రాజెక్టుకి ఒప్పుకున్నాడు. దీంతో ఇంతమంది ఇంప్రెస్ చేయలేని తారక్ ను బాబీ ఎలాంటి కథ చెప్పి ఒప్పించి ఉంటాడు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడనే వార్త కూడా బయటికొచ్చి ప్రాజెక్ట్ పై హైప్ ను మరింతగా పెంచేయగా తాజాగా కళ్యాణ్ రామ్ ఫిల్మ్ చాంబర్స్ లో రిజిస్టర్ చేయించిన టైటిల్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఎన్టీఆర్- బాబీల సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆరార్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ ‘జై లవకుశ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటం, కళ్యాణ్ రాజ్ ఫిక్స్ చేసిన టైటిల్ లో మూడు పేర్లు కనిపిస్తుండటంతో ఈ టైటిల్ ఎన్టీఆర్ సినిమా కోసమే అని ఫిల్మ్ నగర్ లో వార్తలు బయలుదేరాయి. అయితే ఎన్టీఆర్, బాబీ, కళ్యాణ్ రామ్ ల నుండి అధికారిక ప్రకటన వెలువడే దాకా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్థారించలేం. ఎందుకంటే కళ్యాణ్ రామ్ తన బ్యానర్లో మరికొన్ని సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు గనుక వాటిలో ఏదో ఒకదాని కోసం కూడా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించి ఉండవచ్చు.