యూట్యూబ్ లో హవా చూపుతున్న ‘అజ్ఞాతవాసి’ !

1st, January 2018 - 08:42:06 AM

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో క్రేజ్ మామూలుగా లేదు. సినిమాకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెద్ద సంచనలనమైపోతోంది. ఇప్పటికే టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ అందుకోగా నిన్ననే విడుదలైన ‘కొడకా కోటేశ్వర్ రావ్’ కూడా అదే స్థాయి క్రేజ్ తో దూసుకుపోతోంది.

పవన్ స్వయంగా పాడిన ఈ పాట మాస్ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేస్తోంది. విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ఈ పాటకు యూట్యూబ్ లో సుమారు 2.78 మిలియన్ల వ్యూస్ 2.27 లక్షల లైక్స్ దక్కాయి. దీన్నిబట్టి సినిమా పట్ల అభిమానుల్లో ఏ స్థాయి క్రేజ్ ఉందో సులభంగా అర్థమైపోతోంది. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్ చిత్రాన్ని జనవరి 10న విడుదలచేయనుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించారు.

‘కొడకా కోటేశ్వర్ రావ్’ పాట కొరకు క్లిక్ చేయండి: