‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో విలన్ గా కోలీవుడ్ యాక్టర్

Published on Sep 27, 2023 9:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీస్ లో ఒకటైన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపుగా పదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ శంకర్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్నఈ మూవీలో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని తమిళ సూపర్ హిట్ తేరి కి రీమేక్ గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో కీలకమైన విలన్ పాత్రలో కోలీవుడ్ యాక్టర్ అయిన పార్తీబన్ నటిస్తున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఈమూవీలో ఆయన పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందట. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకునేలా ఈ సినిమాని దర్శకుడు హరీష్ శంకర్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని ఉస్తాద్ భగత్ సింగ్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :