అక్కడ కొత్త సినిమా కంటే రీరిలీజ్ కే ఎక్కువ ప్రాధాన్యత


మళ్ళీ చాలా కాలం తర్వాత థియేటర్స్ లో సరైన సినిమాలు లేక వాతావరణం అంతా డ్రై నడుస్తుంది. నిజానికి వేసవి రేస్ అంటేనే అనేక చిత్రాల సమ్మేళనం. అలాంటిది ఈ వేసవికి తెలుగు సహా తమిళ్ లో కూడా అంత చెప్పుకోదగ్గ సినిమాలు లేవు పైగా ఆడియెన్స్ కూడా మరీ అంత ఆసక్తిగా కనిపించడం లేదు. అయితే తమిళ నాట ఈ డ్రై వాతావరణంలో దళపతి విజయ్ నటించిన “గిల్లీ” రీ రిలీజ్ చేయగా దీనికి ఒక ఊహించని స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

ఆల్రెడీ 3 లక్షలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి అమ్ముడుపోయాయి. ఇక మరో పక్క యాక్షన్ హీరో విశాల్ నటించిన “రత్నం” అనే కొత్త సినిమా రిలీజ్ కి రాగా ఇది కూడా ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం గమనార్హం. ఇదొక ఎత్తు అయితే అసలు కొత్త సినిమా కంటే రీ రిలీజ్ సినిమాకే ఎక్కువ టికెట్స్ బుక్ అవ్వడం అనేది మరో ఎత్తు. గిల్లీ ఆల్రెడీ చాలా రోజులు నుంచి థియేటర్స్ లో ఉంది.

రత్నం నిన్ననే తమిళ నాట థియేటర్స్ లోకి రిలీజ్ కాగా మొదటి రిలీజ్ దాని కంటే ఎన్నో రోజులు థియేటర్స్ లో ఉన్న గిల్లీ సినిమా బుకింగ్స్ ఎక్కువ ఉండడం విశేషం. రత్నం డే 1 కి 24 గంటల్లో 33 వేలకి పైగా టికెట్స్ బుక్ అయితే గిల్లీ కి మాత్రా 36 వేలకి పైగా బుక్ అవ్వడం విశేషం. దీనితో ఓ కొత్త సినిమా ఉన్నా కూడా రీ రిలీజ్ కే తమిళ ఆడియెన్స్ ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యకరం అని చెప్పాలి.

Exit mobile version