‘ఇలియానా’ను బ్యాన్ చేశారా ?

Published on Mar 12, 2023 12:30 am IST

సీనియర్ హీరోయిన్ మరియు గోవా బ్యూటీ ఇలియానాను తమిళ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ మధ్య ఒక తమిళ సినిమా కోసం ఇలియానా సైన్ చేసిందని.. నిర్మాత నుంచి అడ్వాన్స్ కూడా తీసుకుందని.. అయితే, ఆ తర్వాత ఇలియానా ఆ సినిమాలో నటించలేదట. దీంతో కాంట్రాక్టు ను ఇలియానా బ్రేక్ చేసిందంటూ సదరు నిర్మాత ఫిర్యాదు చేయడంతో కోలీవుడ్ ఇలియానాను బ్యాన్ చేసిందని టాక్ నడుస్తోంది.

ఇక ఇలియానా ప్రేమ పై ఇప్పటికే అనేక పుకార్లు వినిపించాయి. ఇలియానా.. కత్రీనా కైఫ్‌ సోదరుడు ‘సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’తో లవ్‌ ట్రాక్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలియానా – సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’ పెళ్లికి రెడీ అయ్యారట. ఐతే ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఇలియానా నిజంగానే పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :