ఈ ఏడాదిలో బిగ్ స్టార్స్ సినిమాలు అటుంచితే సౌత్ సినిమా దగ్గర బాగా వర్కౌట్ అయ్యిన సినిమాలు మాత్రం యూత్ రిలేటెడ్ సినిమాలే అని చెప్పాలి. అలా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా ‘యూత్’ కూడా ఒకటి.
యువ నటీనటులు కెన్ కరుణాస్, అనిష్మ అనిల్ కుమార్, సూరజ్ వెంజరమూడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు కెన్ కరుణాస్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే దీనిని అప్పుడు థియేటర్స్ లో పెద్దగా అవగాహన లేక మిస్సయ్యినవారికి మాత్రం మంచి ఛాన్స్ వచ్చేసింది.
పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేసింది. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగు డబ్ సహా ఇతర పాన్ ఇండియా భాషలలో ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులో ఉంది. సో ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందించగా కరుప్పయ సి రామ్, సులోచన కుమార్ లు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
