కోలీవుడ్ బజ్ : 2024 సంక్రాంతి కి రానున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’ ?

Published on Sep 6, 2023 3:01 am IST

కోలీవుడ్ యువ నటుడు శివ కార్తికేయన్ ఇటీవల మహావీరుడు మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ నటిస్తోన్న పాన్ ఇండియన్ మూవీ అయలాన్. కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ మూవీని ఆర్ రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సైన్స్ ఫిక్షన్ జానర్ కామెడీ ఎంటర్టైనర్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న అయలాన్ మూవీని రానున్న దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే విషయం ఏమిటంటే, తాజా కోలీవుడ్ బజ్ ప్రకారం మూవీకి సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కొంత పెండింగ్ ఉండడంతో దీనిని రానున్న 2024 సంక్రాంతి కి రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మేకర్స్ నుండి అఫీషియల్ గా రిలీజ్ కి సంబంధించి అప్ డేట్ రావాల్సిందే.

సంబంధిత సమాచారం :