అ, కల్కి మూవీస్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ హను మాన్. యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా దాశరథి శివేంద్ర ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన హను మాన్ టీజర్ ఇటీవల పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుని దూసుకెళుతోంది. ఇక ఈ టీజర్ పై ఇప్పటికే పలువురు ప్రేక్షకాభిమానులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ప్రసంశలు కురిపిస్తున్నారు.
కాగా కొద్దిసేపటి క్రితం కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ హను మాన్ టీజర్ పై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ టీజర్ చూశానని మాస్, క్లాస్, ఫాంటసీ అంశాలతో టీజర్ అద్భుతంగా విజువల్ వండర్ గా అదిరిపోయిందని అన్నారు. హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత, నటి వరలక్ష్మి శరత్ కుమార్ అందరూ టీజర్ లో సూపర్ గా పెర్ఫార్మ్ చేసారని, తన తరపున హను మాన్ యూనిట్ కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు అట్లీ. భారీ యాక్షన్ అంశాలతో కూడిన ఫాంటసీ మూవీగా రూపొందుతున్న హను మాన్ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
#HanuManTeaser https://t.co/8LOCcTrRSN @PrasanthVarma massy & classy teaser looks lik a great fantasy family entertainer @tejasajja123 super work @Actor_Amritha great one congratulations ???? @varusarath5 superb work ???? congratulations & all the best to entire team sure shot
— atlee (@Atlee_dir) November 25, 2022