“రంగస్థలం”లో ఆ సాంగ్ కి తమిళ్ స్టార్ దర్శకుడు ఇప్పుడు ఫిదా.!

Published on Feb 23, 2022 10:00 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రాల్లో భారీ హిట్ గా నిలిచిన చిత్రం “రంగస్థలం”. మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం వారి కెరీర్ లలోనే భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే హీరోయిన్ సమంతా సహా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ల కెరీర్ లో కూడా బెస్ట్ సినిమాగా అప్పుడు సంచలన విజయం నమోదు చేసింది. అయితే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ప్రతి మ్యూజిక్ ట్యూన్ మ్యాజిక్ చేసింది.

మరి వాటిలో కోలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ఫిదా అయ్యారు. ఆ సాంగ్ నే మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఊపేసిన పాట “ఎంత సక్కగున్నావే”. ఇప్పుడు ఈ సాంగ్ పై సెల్వ రాఘవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఈ సాంగ్ ని నేనెలా మిస్సయ్యాను? ఏం అరేంజ్మెంట్స్ చేసావ్ దేవీ అదిరిపోయే ట్యూన్ అంటూ దేవిశ్రీ ప్రసాద్ ట్యాగ్ చేసి ప్రశంసలు కురిపించారు. దీనితో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :