నిఖిల్ సిద్ధార్థ్ “18 పేజెస్” నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ

నిఖిల్ సిద్ధార్థ్ “18 పేజెస్” నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ

Published on Nov 28, 2022 12:01 PM IST

టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరియు బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మళ్లీ 18 పేజెస్ చిత్రం కోసం ఒక్కటయ్యారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 23, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని రోజులుగా, కోలీవుడ్ స్టార్ హీరో శింబు 18 పేజెస్ సాంగ్ కోసం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ రోజు, మేకర్స్ దానిని ధృవీకరించారు. టైమ్ ఇవ్వు పిల్ల అనే సాంగ్ ను శింబు పాడినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5, 2022 న ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథను అందించారు. GA2 పిక్చర్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు