వెంకటేష్ ‘సైంధవ్’ లో కోలీవుడ్ యంగ్ యాక్టర్ ?

Published on Feb 20, 2023 7:42 pm IST


విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ సైంధవ్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. వెంకట్ బోయిన్ పల్లి ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్డఖి కీలక పాత్ర చేస్తుండగా దీనిని యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు లోకేష్.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో కోలీవుడ్ యంగ్ యాక్టర్ ఆర్య ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారట. సినిమాలో ఆయన పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ ని మార్చి నెలాఖరు నుండి ప్రారంభించనున్న యూనిట్, వీలైనంత త్వరగా షూట్ మొత్తం కంప్లీట్ చేసి దీనిని ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.

సంబంధిత సమాచారం :