“RRR” కోసం తన సినిమా వాయిదా వేసుకున్న కోలీవుడ్ యంగ్ హీరో.!

“RRR” కోసం తన సినిమా వాయిదా వేసుకున్న కోలీవుడ్ యంగ్ హీరో.!

Published on Mar 2, 2022 1:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం రిలీజ్ ఫైనల్ గా ఈ మార్చ్ 25కి ఫిక్స్ అయ్యి సిద్ధంగా ఉంది.

మరి ఈ భారీ సినిమా రిలీజ్ వస్తుందంటే ఇది వరకే పలు సినెమాలు వాయిదా పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి కూడా “RRR” కోసం తన సినిమాని కోలీవుడ్ కి చెందిన యంగ్ హీరో పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు. ఈ సినిమా తమిళ్ వెర్షన్ కి గాను ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా వెళ్లిన యంగ్ హీరో కార్తికేయ.

తాను నటించిన లేటెస్ట్ అండ్ అవైటెడ్ చిత్రం “డాన్” ని “RRR” సినిమా కోసం వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు కన్ఫర్మ్ చెయ్యగా RRR చిత్ర యూనిట్ తమ కోసం మళ్ళీ ఈ స్థాయి సపోర్ట్ ఇచ్చినందుకు కార్తికేయ కు చాలా థాంక్స్ చెబుతున్నామని తెలిపారు. అలాగే డాన్ సినిమాని మే 13న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు