“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” పై శివ కార్తికేయన్ రివ్యూ

Published on Sep 15, 2023 11:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా స్టార్ హీరోయిన్ టాలీవుడ్ కి స్వీటీ అయినటువంటి అనుష్క హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచి మంచి మౌత్ టాక్ ని తెచ్చుకుని మంచి వసూళ్ళని తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా రాబట్టింది.

అయితే ఈ చిత్రాన్ని తమిళ్ నుంచి యంగ్ హీరో శివ కార్తికేయన్ చూసిన తరువాత తన రెస్పాన్స్ ని పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చూసి తాను ఎంతగానో ఎంజాయ్ చేశాను అని నవీన్ మరియు అనుష్క లకు కంగ్రాట్స్ చెప్తూ తమ ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడడం ఎంతో ఆనందంగా అనిపించింది అని అలాగే చిత్ర యూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు.

దీనితో నవీన్ తన ఫేవరెట్ హీరో శివకార్తికేయన్ గారికి నా సినిమా నచ్చడం ఎంతో ఆనందంగా ఉందని మీ జర్నీ చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను అని మావీరన్ నుంచి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కి రివ్యూ రావడం ఆనందంగా ఉందని నవీన్ తెలిపి తన ఎగ్జైట్మెంట్ ని కనబరిచాడు.

సంబంధిత సమాచారం :