‘భీం’ సెన్సేషన్..టాలీవుడ్ లో ఫస్ట్ ఎవర్ రికార్డ్.!

Published on Sep 25, 2021 4:00 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలని పెట్టి స్టార్ట్ చేసిన బిగ్గెస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. వీరిద్దరితో పాటు మరింత మంది కీలక నటులు ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఒకరు అల్లూరి సీతారామరాజు మరొకరు కొమరం భీం లుగా అత్యంత పవర్ ఫుల్ ఎలిమెంట్స్ గా రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు.

అయితే వీటితో భీం గా తారక్ పై డిజైన్ చేసిన టీజర్ కి మాత్రం నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. భారీ లెక్కనలో వ్యూస్ మరియు ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ కలిగిన వీడియోగా ఇది టాలీవుడ్ లో హిస్టరీ నమోదు చేసింది. మరి ఈ మేనియా ఇప్పుడు 1.5 మిలియన్ లైక్స్ కి చేరి మరో ఫస్ట్ ఎవర్ రికార్డును సెట్ చేసింది. దీనితో ఒకే టీజర్ రెండు ఫస్ట్ ఎవర్ రికార్డ్స్ ను తారక్ తన వసం చేసుకున్నాడు. మరి ఈ భారీ సినిమా కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇదెప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి ఇక.

సంబంధిత సమాచారం :