భీమ్ లోని బలమైన భావోద్వేగాలతో “RRR” నయా ప్రోమో.!

Published on Dec 23, 2021 11:52 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుండగా ఇప్పుడు చిత్ర యూనిట్ అంతా సాలిడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి కొమురం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి డిజైన్ చేసిన సాంగ్ దాని ప్రోమో ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసారు.

ప్రమోషనల్ సాంగ్ గా సాలిడ్ విజువల్స్ తో కనిపిస్తున్నా ఇది మాత్రం సుద్దాల అశోక్ తేజ సాహిత్యంగా బలమైన భావోద్వేగాలతో కూడుకొని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కాలభైరవ ఇంటెన్స్ వాయిస్ లో ఈ సాంగ్ మరింత బలంగా అగుపించేలా అనిపిస్తుంది.

మరి ఈ టోటల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపు సాయంత్రం 4 గంటల వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 7న రిలీజ్ కానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :