ఎన్టీఆర్ ఎమోషనల్ నటనకు ప్రేక్షకులు కన్నీళ్లు !

Published on Mar 27, 2022 3:05 pm IST

రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమాలో ఓ సాంగ్ లో ఎన్టీఆర్ నటనకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. సినిమాలో స్నేహానికి ప్రాణమిచ్చే కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉంది. భీమ్ పాత్రలో తారక్ ఒదిగిపోయారు.

అమాయకత్వంతో కూడిన విప్లవ వీరుడి పాత్రలో ఎన్టీఆర్ అబ్బురపరిచారు. ముఖ్యంగా ‘కొమురం భీముడో’ అంటూ సాగే సాంగ్ లో ఎన్టీఆర్‌ నటన అభిమానుల చేతే కాదు, ప్రేక్షకులు, ప్రముఖుల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. ఎన్టీఆర్ ఎమోషనల్ నటన ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా చేసింది. థియేటర్‌లో ఎన్టీఆర్ నటనను చూస్తూ ఓ మహిళ భావోద్వేగానికి గురవుతూ కనిపించింది. ప్రస్తుతం వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ అద్భుతమైన యాక్షన్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

సంబంధిత సమాచారం :