“ఆర్ ఆర్ ఆర్” మూవీ నుండి కోమురం భీముడో సాంగ్ విడుదల!

Published on Dec 24, 2021 7:27 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ సైతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి రివోల్ట్ ఆఫ్ భీమ్ పేరిట కొమురం భీముడో అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అటు హిందీ లో, ఇటు తెలుగు లో విడుదల చేయడం జరిగింది. కాల భైరవ పాడిన ఈ పాట హృదయం ను హత్తుకునే విధంగా ఉంది. ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి ఈ పాట కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :