అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కి వచ్చేసిన “కొండ పొలం”..!

Published on Dec 8, 2021 12:02 am IST


మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలై మంచి టాక్‌నే తెచ్చుకుంది.

అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవుతోంది. ఇంజ‌నీరింగ్ చ‌దివిన ఓ యువ‌కుడు ఉద్యోగం సంపాదించుకోవ‌డానికి భ‌య‌ప‌డుతూ కొండ‌పొలంకు వెళ్లిన‌ప్పుడు మాన‌సికంగా ఎలాంటి మార్పు చెందాడనేదే ఈ మూవీ క‌థ‌. కాగా ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :