ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘కొండపొలం’ !

Published on Sep 27, 2021 3:42 pm IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ‘కొండపొలం’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కాగా ట్రైలర్ చాలా బాగుంది. క్రిష్ హృదయాన్ని తాకేలా సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతుంది. సినిమాలో ఎమోషన్ కూడా చాలా బాగా హైలైట్ అయింది.

ఇక ఈ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు పాత్రలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. అలాగే అడవి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేశారు. ఇక రకుల్ మేకలు కాసుకునే పూర్తి గ్రామీణ యువతిగా కనిపించింది. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు.

ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రాబోతున్న కొండపొలం సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :