“ఖిలాడీ” చిత్రానికి నిర్మాత‌నైనందుకు గర్వపడుతున్నా – కోనేరు స‌త్య‌నారాయ‌ణ

“ఖిలాడీ” చిత్రానికి నిర్మాత‌నైనందుకు గర్వపడుతున్నా – కోనేరు స‌త్య‌నారాయ‌ణ

Published on Feb 10, 2022 2:00 AM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఖిలాడీ”. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా పూర్తి చేశారు. అందుకే ఈనెల 11న రాబోతున్నాం. ఈ ఫంక్ష‌న్‌కు చిరంజీవి, బాల‌కృష్ణ‌ను పిలిచాం. అనుకోకుండా ఫంక్ష‌న్ చేయ‌డంతో వారి డేట్స్ కుద‌ర‌లేదు. ఈ సినిమా 130 రోజులు చేశాం. ర‌వితేజ రెండు సినిమాల ప‌ని చేశారు. ఏరోజూ డేట్ విష‌యంలో మ‌మ్మ‌ల్ని క్వ‌చ్చ‌న్ చేయ‌లేదు. సినిమా బాగా రావాల‌నే త‌ప‌న ఆయ‌న‌ది. ర‌వితేజ‌గారు షూట్‌లో వుంటే హ్యీపీ ఎన‌ర్జీ వుంటుంది. ఈసారి మ‌రో సినిమా చేస్తాన‌ని కూడా చెప్పాను. నాకు కాలేజీ రోజుల్లో సంగీతం అంటే ఇష్టం. త‌ర్వాత నేను నా వృత్తిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు సినిమా రంగంలోకి వ‌చ్చాను. నా అబ్బాయి హ‌వీష్ ఈ రంగంపై ఆస‌క్తి చూప‌డంతో వ‌చ్చాను.

ఖిలాడి టైటిల్ ర‌వితేజ‌కే యాప్ట్‌. క‌థ చెప్పిన‌వెంట‌నే మాకు ఓకే చేసేశారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ. ఇప్ప‌టికే హిందీలో ఆయ‌న‌కు ఫ్యాన్స్ వున్నారు. తెలుగులో పాటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేస్తున్నాం. దేవీశ్రీ సంగీతానికి మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చేశాయి. దాంతో ప‌బ్లిక్‌లోకి సినిమా నానిపోయింది. ఈ సినిమా చూశాక అంద‌రికీ న‌చ్చుతుందనే న‌మ్మ‌కం వుంది. వంద‌రూపాయ‌ల‌తో టికెట్ కొంటే 500 రూపాయ‌ల విలువ‌చేసే ఔట్‌పుట్ ఇస్తున్నాం. ఇందులో ర‌వితేజ స్టైలిష్‌గా ఉంటారు. ఈ సినిమా తీసినందుకు నిర్మాత‌గా గ‌ర్వ‌ప‌డుతున్నాను తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు