కొరటాల అసహనం అదేనట

Koratala Siva

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ నుండి సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. మహేష్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను ఆయన చివరి చిత్రంగా కాగా, ఆ మూవీ 2018 ఏప్రిల్ లో విడుదలైంది. ఆ మూవీ తరువాత చిరంజీవితో సినిమా కమిటైన కొరటాల ఆయన కోసం ఏడాదికి పైగా ఎదురుచూశారు. చిరంజీవి గత చిత్రం సైరా విడుదల లేటు కావడంతో కొరటాలకు పెద్ద గ్యాప్ వచ్చింది.

ఇక చిరుతో ఆచార్య మూవీ చకచకా పూర్తి చేసి మరో కొత్త మూవీపై ఫోకస్ పెడదాం అని కొరటాల ఆలోచన కాగా..కరోనా వైరస్ వలన ఏర్పడిన లాక్ డౌన్ ఆయన ప్లాన్ తారుమారు చేసింది. దీనితో ఏకంగా మూడునెలలు షూటింగ్ ఆగిపోయింది. ఐతే లాక్ డౌన్ సడలింపుల కారణంగా షూటింగ్ కి అనుమతి దొరికినా..చిరు తన వయసు రీత్యా షూటింగ్ కి పాల్గొన్నాడానికి ఆసక్తిచూపడం లేదు. దీనితో ఆచార్య మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుండగా, కొరటాల శివలో అసహనం మొదలైందట.

Exit mobile version