ఎన్టీఆర్ సినిమా సెట్ వర్క్ పూర్తయిందట !

ఎన్టీఆర్ సినిమా సెట్ వర్క్ పూర్తయిందట !

Published on Oct 25, 2021 6:58 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి భారీ సెట్ వర్క్ శరవేగంగా జరుగుతుందని ఆ మధ్య దర్శకుడు కొరటాల తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సెట్ వర్క్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే ఈ సినిమా సెట్ ను నిర్మిస్తున్నామని.. సినిమాలో కీలక భాగం ఈ సెట్ లోనే ఉంటుందని.. కొరటాల శివ చెప్పుకొచ్చాడు.

ఇక కొరటాల శివ స్క్రిప్ట్‌ లో ఎన్టీఆర్ కొన్ని కీలక మార్పులు చెప్పారని.. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ లో ఆ మార్పుల పై వర్క్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని.. ఎన్టీఆర్ ఫుల్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు