ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ మొదలెట్టనున్న కొరటాల శివ..!

Published on Nov 17, 2021 3:02 am IST


బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో “ఆచార్య” సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుంది. ఇకపోతే కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించినట్టు తెలుస్తుంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో డిసెంబర్ నెలాఖరు వరకు ఆయన షూటింగ్‌కి హాజర్ కాలేడు. అప్పటి వరకు ఆగకుండా ఎన్టీఆర్‌ను పక్కనపెట్టి ఇతర తారాగణంతో షూటింగ్ ప్రారంభించాలని కొరటాల నిర్ణయించుకున్నాడని సమాచారం. ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజ్ ఉండడంతో ప్రమోషన్ కోసం కాస్త గ్యాప్ తీసుకుని, విడుదల పూర్తైన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చేసి ఆ సినిమాను వచ్చే ఏడాది దసరాకి విడుదల చేయాలని కొరటాల ప్లాన్ చేసుకున్నాడట.

సంబంధిత సమాచారం :

More