“ఆచార్య” లో వేసిన టెంపుల్ సెట్ భారతదేశంలోనే అతి పెద్దది – కొరటాల శివ

Published on Apr 25, 2022 8:00 pm IST


మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆచార్య. ధర్మస్థలి లోని దేవాలయం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిందని ప్రోమోల్లో చూపించారు. కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ధర్మస్థలి సెట్ భారతదేశంలో ఇప్పటివరకు వేసిన అతిపెద్ద సెట్ అని చెప్పారు.

హైదరాబాద్ శివార్లలో 20 ఎకరాల విస్తీర్ణంలో సెట్‌ను నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ అద్భుతంగా పని చేశారని కొరటాల శివ కొనియాడారు. ఈ సెట్‌లో దేవాలయాలు, గురుకులం, మార్కెట్ స్ట్రీట్ మరియు ఒక చిన్న పట్టణంలోని అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. తెరపై ఇవి అద్భుతంగా కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సినిమా చాలా వరకు ఈ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో జరగడంతో మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. ఆచార్య ఈ నెల 29న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :