“సాగర సంగమం” పై శివ కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 26, 2022 8:12 pm IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆచార్య చిత్రం ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివను తెలుగులో తనకు ఇష్టమైన కమర్షియల్ సినిమా గురించి చెప్పమని అడిగారు. ఈ మేరకు శివ స్పందిస్తూ, సాగర సంగమం అంటూ చెప్పుకొచ్చారు. చాలా కారణాల వల్ల సినిమా తనకు నచ్చిందని, ఇది అద్భుతమైన స్క్రిప్ట్ అని అన్నారు. అంతేకాకుండా, శంకర్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన భారతీయుడు కూడా తన అభిమాన కమర్షియల్ సినిమా అని పేర్కొన్నాడు. ఆచార్య మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా బ్యాంక్రోల్ చేయబడింది. ఈ సినిమాలో పూజా హెగ్డే, సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :