సుకుమార్, బన్నీ లపై కొరటాల శివ కీలక వ్యాఖ్యలు!

Published on Dec 12, 2021 10:36 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నేడు జరిగింది. ఈ వేడుక లో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రం తీయాలి అంటే అది కేవలం సుకుమార్ గారు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి పాత్రలు, యూనివర్స్ క్రియేట్ చేయాలి అంటే అది సుకుమార్ తప్ప వేరే ఇంకెవరూ చేయలేరు. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకూ అదే కమిట్ మెంట్, అదే ప్యాషన్, ఈ క్షణం వరకూ కూడా, ఇంత ఫంక్షన్ జరుగుతున్నా కూడా బాంబే లో తన ఫైనల్ ప్రొడక్ట్ కోసం కష్ట పడుతున్నారు అంటే, రియల్లీ హ్యాట్సాఫ్ సుక్కు భాయ్.

సుక్కు స్పీచ్ అనుకోండి అంటూ, కొరటాల శివ పలు విషయాలను వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పై ప్రశంశల వర్షం కురిపించారు. నటీనటులు అయిన రష్మిక, సునీల్, అనసూయ భరద్వాజ్ ల పై పొగడ్తల వర్షం కురిపించారు.

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, డే బై డే మీకు నేను ఫ్యాన్ ను. ప్రతి సినిమా కి ఇంత ఎవాల్వ్ అవుతున్న యాక్టర్ భారతదేశంలోనే ఎవరు లేరు అంటే అతిశయొక్తి కాదు. పాత్రలు, నటన, సినిమా తప్ప వేరే టాపిక్ గురించి బన్నీ మాట్లాడరు. ఈ సినిమా కి పెట్టిన ఎఫర్ట్స్ అయితే, ఒక పాత్ర కి జీవం పోసే యాక్టర్ డెఫినెట్ గా ఎవరూ ఉండరు. అది నేను నమ్ముతున్నా. పుష్ప కోసం, మీకోసం నేను ఎదురు చూస్తున్నా. పుష్ప 2 తర్వాత ఇంతకంటే పెద్ద వరల్డ్, పెద్ద కథ తో మీ ముందుకు వస్తాను. మీకు ఛాలెంజింగ్ గా రాయాలి అనేది అర్దం అవుతుంది. పుష్ప టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఈ ఒక లైన్ నాది అంటూ కొరటాల శివ అన్నారు.

సంబంధిత సమాచారం :