డైలాగ్ రైటర్ నుండి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు కొరటాల శివ. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని, మెగాస్టార్ కోసం ఆయన ఒక పవర్ ఫుల్ కథ రాశారని ఆ కథలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.
తాజా సమాచారం ప్రకారం కొరటాల రైటర్ గా ఉన్నప్పుడు మెగాస్టార్ కోసం నిజంగానే ఒక పాయింట్ అనుకున్నారట. ప్రస్తుతం ఆ పాయింట్ మీద కొరటాల వర్క్ చేస్తున్నారని సమాచారం. అన్ని కుదిరితే తన తర్వాత సినిమా కాకపోయినా ఆ తర్వాత సినిమానైనా మెగాస్టార్ తో చెయ్యాలని కొరటాల శివ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ విషయానికి వస్తే “ఖైదీ నెంబర్ 150 ” చిత్రంతో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టారు. ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
