‘ఎన్టీఆర్ – కొరటాల’ సినిమా కథాంశం ఇదే ?

Published on Feb 15, 2022 10:34 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో ‘మూఢనమ్మకాలతో మనుషులు ఎలా పక్కదారి పడుతూ.. తమని తాము ఎలా హింసించుకుంటున్నారో అనే కోణంలో ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను స్పీడప్‌ చేశారు. పైగా మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ను స్టార్ట్ చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :