మహేష్ – కొరటాల సినిమా స్టోరీ ఇలానే ఉంటుందట !
Published on Jul 23, 2017 11:04 am IST


‘శ్రీమంతుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివలు కలిసి చేస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. కొరటాల ఎక్కువగా సామాజిక అంశాల మీద దృష్టి పెట్టే దర్శకుడు కావడం, టైటిల్ చూస్తే దేశ భక్తి ఉట్టిపడుతుండటంతో ఈ సినిమా పక్కా సోషల్ సబ్జెక్ట్ అందరిలోనూ ఒక అభిప్రాయం స్థిరపడిపోగా గత కొద్ది రోజులుగా ఈ సినిమా పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామాగా ఉంటుందని, అందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనబడతారనే టాక్ కూడా మొదలైంది. దీంతో సినిమాపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన కొరటాల శివ ఈ సినిమా ఏ పొలిటికల్ పార్టీని, లీడర్ ను ఉద్దేశించి రూపొందిస్తున్నది కాదని, ఇందులో సెటైరికల్ డైలాగ్స్ ఉండవని అంటూనే ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం సమకూరుస్తుండగా 2018 ఆరంభంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook