హ్యాట్రిక్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కొరటాల శివ

Koratalla-Siva
కొరటాల శివ, తారక్ ల కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సందర్బంగా దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ అనుభూతులను పంచుకున్నారు. ఈ సందర్బంగా కొరటాల శివ మాట్లాడుతూ ‘నా కెరీర్లో ఇదే ఉత్తమ చిత్రమని అందరూ అంటున్నారు. పలు ఏరియాల నుండి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫోన్ చేసి ఫస్ట్ వీక్ లోనే సేఫ్ అవుటామని అంటున్నారు’ అన్నారు.

అలాగే మోహన్ లాల్ గర్ ఫోన్ చేసి అభినందించారని, ఇది తనకు హ్యాట్రిక్ హిట్ కాగా మైత్రీ మూవీ మేకర్స్ రెండవ విజయమని, ఈ విజయంతో తన మీద మరింత బాధ్యత పెరిగిందని, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి ఇంట గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదని అన్నారు. ఇకపోతే ఈ చిత్రం మొదటిరోజే ఏపీ, తెలంగాణాల్లో రూ. 21 కోట్లు వసూలు చేయడం విశేషం.