“ఆచార్య”లో పవర్ఫుల్ షాట్ పై కొరటాల ఇంట్రెస్టింగ్ వివరణ.!

Published on Nov 30, 2021 2:01 pm IST


టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో “ఆచార్య” కూడా ఒకటి. మెగా స్టార్ చిరంజీవి మరియు మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లుతో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి మొన్ననే చరణ్ చేసిన “సిద్ధ” పాత్రకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇంకా ఆ టీజర్ లో లాస్ట్ షాట్ కోసం అయితే ఇప్పటికీ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఈ పవర్ ఫుల్ సన్నివేశం పైనే కొరటాల శివ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. టీజర్ లో అనే కాకుండా సిద్ధ పాత్రకి సంబంధించి ఒక ఫ్లో లో చాలా ఆర్గానిక్ గా సన్నివేశాలు వెళతాయని అలా వెళ్లే సన్నివేశాల్లో ఇది ఒకటని తెలిపారు.

అంతే కాకుండా సీన్ తీసేటప్పుడు కూడా ముందు చాలా హై ఇస్తుంది అనుకున్నాం కానీ రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్కువ వచ్చిందని కొరటాల తెలిపారు. అలాగే ఈ షాట్ ఒక్క మెగాస్టార్, మెగా తనయుడు రామ్ చరణ్ లకు మాత్రమే సెట్టయ్యేది అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఇక ఈ భారీ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :