“ఎన్టీఆర్30” లాంచ్ లో కొరటాల ఇంట్రెస్టింగ్ స్పీచ్.!

Published on Mar 23, 2023 11:03 am IST

గ్లోబల్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తారక్ కెరీర్ లో 30వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా ఈరోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం తో అయితే మొదలైంది. మరి ఈ భారీ సినిమా లాంచ్ లో దర్శకుడు కొరటాల స్పీచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు.

అయితే ఈ లాంచ్ లో కొరటాల ఎలాంటి సెన్సిటివ్ అంశాలకు దారి తీయలేదు కానీ సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడిన మాటలు తారక్ ఫ్యాన్స్ కి మరింత నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమా లైన్ కోసం ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ ఇస్తూ ఓ రేంజ్ లో ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఉంటుంది అని తెలిపారు. ఇక మరో పక్క అయితే ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ గా నిలుస్తుంది అని అలాగే తాను ఈ సినిమాకి బెస్ట్ టీం తో వర్క్ చేస్తున్నానని కొరటాల తెలిపారు. దీనితో తన స్పీచ్ తో మాత్రం ఇప్పుడు అందరిలో మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :