ధైర్యం చేసినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పిన కొరటాల!

ప్రభాస్ కెరీర్లోని హిట్ చిత్రాల్లో ‘మిర్చి’ కూడ ఒకటి. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు కొరటాల శివ లాంటి మంచి దర్శకుడు దొరికాడు. చేసిన తొలి చిత్రంతోనే అందరి మెప్పునూ పొంది కమర్షియల్ డైరెక్టర్ గా మారిన కొరటాల శివ మాత్రం ‘బాహుబలి’కి సిద్దమవుతున్న తరుణంలో తను చెప్పిన కథను నమ్మి, దర్శకత్వపు అనుభవం లేకున్నా రాజమౌళిని సలహా తీసుకుని తనతో సినిమా చేసిన ప్రభాస్ కే ఘనత మొత్తం దక్కుతుందని పలు సందర్భాల్లో అన్నారు.

అంతేగాక ఈరోజు ‘మిర్చి’ సినిమా విడుదలై 5 ఏళ్ళు కావొస్తున్న సందర్బంగా సినిమా చాలా జ్ఞాపకాల్ని మిగిల్చిందని, తనతో సినిమా చేసే ధైర్యం చూపిన ప్రభాస్ కు, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ కు, సినిమాటోగ్రఫర్ మధికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ చేస్తుండగా కొరటాల శివ మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నారు.

Exit mobile version