ఎన్టీఆర్ తర్వాత ‘బాలయ్య’తోనే చేస్తాడట ?

ఎన్టీఆర్ తర్వాత ‘బాలయ్య’తోనే చేస్తాడట ?

Published on Apr 24, 2022 9:23 PM IST

క్లాస్ డైరెక్టర్ కొర‌టాల శివ‌, బాలయ్యతో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో గాసిప్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయిన తర్వాత, కొరటాల బాలయ్యతోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. 2023 స్టార్టింగ్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతంలోనే బాలయ్యకి కొరటాల ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. బాలయ్య – కొరటాల కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. కాగా కొరటాల ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు.

అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల బాలయ్యతోనే సినిమా చేస్తాడట. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, బాలయ్య కోసం, అలాగే బన్నీ కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు