“ఎన్టీఆర్ 30” పై కొరటాల శివ వేరే లెవెల్ కామెంట్స్ వైరల్.!

Published on Apr 26, 2022 9:00 am IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఫిల్మ్ మేకర్ కొరటాల శివ కూడా ఒకరు. మరి తన ఫస్ట్ సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కో మెట్టు బాక్సాఫీస్ లెక్కల్లో కూడా ఒక్కో ఇంచ్ పెరుగుతూ వస్తున్న ఈ దర్శకుని నుంచి మెగాస్టార్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన భారీ మల్టీ స్టారర్ “ఆచార్య” రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా అనంతరం మళ్ళీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన కెరీర్ లో 30వ సినిమాని కొరటాల డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా కొరటాల కొన్ని కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది. ఈ సినిమా చాలా భారీగా ఉంటుంది అని డెఫినెట్ గా బోర్డర్స్ దాటేస్తామని అప్పుడు జనతా గ్యారేజ్ చేసే టైం లోనే తారక్ కి చెప్పానని..

ఇది ఇలా ఉన్నా నెక్స్ట్ చేసే సినిమా మాత్రం గట్టిగా ఉంటుంది అని ఈ సినిమాలో మరింత స్థాయిలో ఎమోషన్స్ మరియు మాస్ ఎలిమెంట్స్ కూడా అంతే రేంజ్ లో ఉంటాయని కొరటాల ఇంకా తమ సినిమా సెట్స్ మీదకి వెళ్ళక ముందే ఆడియెన్స్ కి పాన్ ఇండియా లెవెల్ అంచనాలు ఇచ్చేసారు. మరి బిగ్గెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :