“స్పిరిట్” లో కొరియన్ స్టార్? ఎంతవరకు నిజం

“స్పిరిట్” లో కొరియన్ స్టార్? ఎంతవరకు నిజం

Published on Jul 7, 2024 3:10 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి” తో భారీ వసూళ్లు నమోదు చేస్తుండగా ఇక ప్రభాస్ నుంచి నెక్స్ట్ రానున్న సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేయనున్న భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో లేటెస్ట్ గా దక్షిణ కొరియన్ స్టార్ నటుడు మా డాంగ్ సియోక్ నటిస్తున్నాడు అని కొన్ని రూమర్స్ వచ్చాయి.

పైగా ఈ చిత్రాన్ని కొరియన్ నేపథ్యంలో కూడా తెరకెక్కించనుండడంతో కనిపిస్తారని ఇవి మరింత ఊపందుకున్నాయి. అయితే అసలు వీటిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఇదంతా జస్ట్ సోషల్ మీడియా మూలాన జరిగిన ప్రచారం తప్పితే ఆ నటుడు ఈ సినిమాలో ఉన్నాడు అనేది ప్రస్తుతానికి అవాస్తవం అనే చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రం అయితే ఈ ఏడాది చివరిలో అలా స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది ముగింపులో కానీ 2026 లో కానీ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు