పవన్ పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్స్ వైరల్.!

Published on Jun 3, 2023 9:04 pm IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న స్టార్ హీరోస్ లో ఇప్పుడు ఉన్న మార్కెట్ లో అయితే నిర్మాతలు ఇప్పుడు తాము అనుకున్న హీరోస్ కి ఎంతైనా ఇచ్చి సినిమాలు చేసుకోడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి స్టార్ నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ తన రెమ్యునరేషన్ విషయంలో గాని తన సినిమాల బాక్సాఫీస్ విషయంలో కూడా ఇది వరకే చాలా సార్లు తన పొలిటికల్ మీటింగ్ లలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

అయితే తన రెమ్యునరేషన్ విషయంలో లేటెస్ట్ గా సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పవన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎందరో దిగ్గజ నటులే తమ పారితోషకం ఎంత తీసుకుంటున్నారు అనేది ఎన్నడూ చెప్పలేదని కానీ ఓ హీరో అలా ఓపెన్ గా ఓ సినిమాకి రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నానని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :