ఏ. కోదండరామిరెడ్డి చేతుల మీదుగా ‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్

Kotha Malupu Trailer

ప్రముఖ నేపథ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు, భైరవి అర్ధ్యా జంటగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తధాస్తు క్రియేషన్స్ పతాకంపై తాటి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని, సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

గ్రామీణ నేపథ్యం, కోనసీమ అందాలతో రొమాంటిక్ లవ్, సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు శివ వరప్రసాద్ తెలిపారు. ఇందులో హీరో, హీరోయిన్లు బావ–మరదళ్లుగా కనిపించనున్నారు. హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ సినిమాలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి, మహేందర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యశ్వంత్ నాగ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, జవహర్ రెడ్డి, సుమంత్ కాచర్ల సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు.

Exit mobile version