“క్రాక్” కీలక నటుడుకి వారసుడు పుట్టాడు.!

Published on May 21, 2022 1:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో తన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ “క్రాక్” చిత్రం కోసం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఎంతో కీలక పాత్రలో ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుధాకర్ కోమాకుల నటించాడు. ఆ సినిమాలోనే కాకుండా మరిన్ని చిత్రాల్లో హీరోగా కీలక పాత్రల్లో నటించిన మెప్పించిన ఈ నటుడు ఇంట ఇప్పుడు ఆనంద వాతావరణం చోటు చేసుకుంది.

తాను మరియు తన భార్య హారిక లు తాజాగా ఒక పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చినట్టుగా తెలిసింది. అయితే ఈ మే 12న చికాగోలో జన్మించిన వారి బాబుకి ఇపుడు “రుద్ర” అనే నామకరణం చేసి ఈ ఆనంద విషయాన్ని సుధాకర్ కుటుంబం మీడియాతో పంచుకున్నారు. దీనితో వారికి శుభాకాంక్షలు వారి కుటుంబ సభ్యులు మరియు సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు.

సంబంధిత సమాచారం :