మరోసారి తన స్పెషాలిటీని చాటుకున్న క్రిష్ !


టాలీవుడ్లోని దర్శకుల్లో దర్శకుడు క్రిష్ ది విభిన్నమైన శైలి. కమర్షియల్ వాల్యూస్ మధ్యన కూడా సినిమాకు సహజత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నించే దర్శకుడాయన. అందుకే అందరిలోనూ ఆయన కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారాయన. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లోనూ ఈ సహజత్వ శైలిని పాటించిన ఆయన ఇప్పుడు చేస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మణికర్ణిక’ విషయంలో కూడా దాన్నే ఫాలో అవుతున్నారు.

వీరనారి ఘాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలా కీలకం. అవే కథను ముందుకు నడుపుతాయి. క్రిష్ వాటిలోనే రియాలిటీని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను యుద్దాల్ని సహజంగా ఉండేలా తీయడం కోసం హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రఫర్ నిక్ పావెల్ ను ఆయన 30 మంది టీమ్ ను రంగంలోకి దింపారు.

‘300 యోధులు, బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్’ వంటి సినిమాలకు పనిచేసిన నిక్ పావెల్ తన టీమ్ తో కలిసి ప్రధాన పాత్రధారి కంగనా రనౌత్ కు, 300 మంది లోకల్ ఫైటర్స్ కి శిక్షణ ఇచ్చి యుద్ధ సన్నివేశాలను రూపొందించారు. దీంతో యుద్ధ సన్నివేశాలన్నీ లైవ్ గా ఉండనున్నాయి.