పవన్ మార్షల్ ఆర్ట్స్ పై క్రిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

పవన్ మార్షల్ ఆర్ట్స్ పై క్రిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Dec 10, 2022 8:00 AM IST

టాలీవుడ్ ఉన్నటువంటి మల్టీ టాలెంటెడ్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ హీరోగా చేసిన ఎన్నో చిత్రాల్లో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. మరి తాను అయితే కిక్ బాక్సింగ్, కరాటే సహా ఇతర మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఇవన్నీ ఓ రెండు దశాబ్దాల కితం “జానీ” తర్వాత పెద్దగా పవన్ చేయలేదు. కానీ ఫైనల్ గా ఇప్పుడు తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కి స్టార్ట్ చేయడం నిన్న పవన్ కూడా ఓ స్టన్నింగ్ స్టిల్ పెట్టడంతో సోషల్ మీడియా షేక్ అయ్యింది.

మరి దీనిపై వీరమల్లు దర్శకుడు క్రిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “పవన్ కళ్యాణ్ గారు మీ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ని దగ్గరుండి హరిహర వీరమల్లు సెట్స్ నుంచి చూడడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నానని అలాగే ఈ చిత్రం పట్ల మీ డెడికేషన్ ప్రపంచం అంతా ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని” తెలిపారు. దీనితో క్రిష్ కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు