ఎన్టీఆర్, మహేష్ ల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్

Published on Aug 23, 2022 1:00 am IST

టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ గులాబీ నుండి ఇటీవల రిలీజ్ అయిన నక్షత్రం వరకు ప్రతి ఒక్క సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఆడియన్స్ లో ప్రత్యేక క్రేజ్ దక్కించుకున్నారు కృష్ణవంశీ. ఆయన నుండి మూవీ వస్తుంది అంటే ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సింధూరం, అంతఃపురం, మురారి, చక్రం, ఖడ్గం, రాఖి, చందమామ, మహాత్మా, మొగుడు, గోవిందుడు అందరి వాడేలే ఇలా తన సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించిన కృష్ణవంశీ లేటెస్ట్ గా తీస్తున్న మూవీ రంగమార్తాండ.

మరాఠీ మూవీ నటసామ్రాట్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న రంగమార్తాండ లో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం దీని డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా పలు విషయాలు వెల్లడించిన కృష్ణవంశీ, ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ కి నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.

అలానే ఆయన తన సినిమా కెరీర్ గురించి చెప్తూ, తనతో కలిసి వర్క్ చేసిన హీరోలు, హీరోయిన్స్ నటీనటులు అందరూ తనకు ఇష్టమే అని, అయితే ముఖ్యంగా మనం రాసుకున్న పాత్రని పెర్ఫార్మన్స్ పరంగా కళ్ళకి కట్టినట్లుగా తెరపై చూపించే నటుల్లో ఎన్టీఆర్, మహేష్ బాబు ఉంటారని, నేటి జనరేషన్ లో ఆ ఇద్దరూ తనకు ఇష్టం అన్నారు కృష్ణవంశీ. ఇప్పటికీ అప్పుడప్పుడు ఎన్టీఆర్ తనకు తారసపడితే, మంచి స్టోరీ ఉంటె చెప్పండి చేద్దాం అని అడుగుతుంటారని ఆయన చెప్పారు.

సంబంధిత సమాచారం :