నాగార్జున గారిని చూసే రాసుకున్నా – కృష్ణవంశీ

Published on Oct 4, 2021 11:00 am IST

కింగ్ నాగార్జున, టబు నటించిన ‘‘నిన్నే పెళ్లాడతా’’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లు అయింది. మరి ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు కృష్ణవంశీ సినిమా గురించి చెప్పిన విశేషాలు ఏమిటో చూద్దాం. ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగార్జునగారు చాలా సహజంగా నటించారు. కారణం.. ఒక్కటే.. ఆయన బయట ఎలా ఉంటారో సినిమాలోనూ అలాగే ఉంటారు.

నేను రియల్‌ లైఫ్‌ లో ఆయన ఎలా ఉంటారో గమనించి.. సినిమాలో నాగార్జున గారి పాత్రను డిజైన్ చేసుకున్నాను. అందుకే సినిమా చాలా బాగా వచ్చింది. ఇక ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడానికి మరో కారణం.. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ‘నా మొగుడు రామ్‌ప్యారి’ అనే పాటని మినహా మిగిలిన అన్ని పాటల్ని గురువుగారే తనదైన శైలిలో అద్భుతంగా రాసి సినిమాకి ప్రాణం పోశారు’ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :