గోపీచంద్, కృష్ణ వంశీ మరోసారి కలుస్తున్నారా !
Published on Oct 19, 2017 1:46 pm IST

దర్శకుల్లో కృష్ణ వంశీ, హీరోల్లో గోపీచంద్ ఇద్దరూ ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ గత చిత్రాలు ‘గౌతమ్ నంద, జిల్, సౌఖ్యం’ వంటివి పెద్దగా విజయాన్ని అందుకోలేదు. అలాగే కృష్ణవంశీ చేసిన ‘నక్షత్రం, గోవిందుడు అందరివాడేలే’ కూడా పరాజయాలుగా నిలిచాయి. అందుకే ఈ ఇద్దరికీ ఇప్పుడు హిట్ తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఇద్దరికి కలిసి పనిచేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, ఇద్దరూ త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు. మరి వీరి కాంబో వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. గతంలో వీరిద్దరూ కలిసి ‘మొగుడు’ అనే చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే గోపీచంద్ నటించిన తాజా చిత్రం ‘ఆక్సిజన్’ ఈ నెల 27న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook