కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ఫస్ట్ రోల్ వీడియో అనౌన్స్ మెంట్.. !

Published on Jul 6, 2022 12:00 am IST

టాలీవుడ్ లో ప్రతి ఒక్క సినిమాతో దర్శకుడిగా ఆడియన్స్ నుండి మంచి పేరుతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ. తొలిసారిగా సింధూరం మొదలుకుని కృష్ణవంశీ తీసే ప్రతి ఒక్క సినిమాలో ఉండే సహజత్వం, ఎమోషన్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. ఇక తన కేరీర్ లో ఇప్పటివరకు మొత్తం 20 సినిమాలు తీసిన కృష్ణవంశీ, వాటిలో కొన్ని పరాజయాలు కూడా చవిచూశారు. ఇక ఆయన తీసిన సినిమాల్లో సింధూరం, అంతఃపురం, మురారి, చందమామ, నిన్నేపెళ్లాడతా, ఖడ్గం, రాఖీ, మహాత్మా వంటి సినిమాలు దర్శకుడిగా ఆయనకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఇక ప్రస్తుతం తన కెరీర్ 21వ మూవీగా రంగమార్తాండ అనే ఎమోషనల్ యాక్షన్ మూవీ తీస్తున్నారు. ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీ పై అందరిలో బాగా అంచనాలు ఉన్నాయి. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మితం అవుతున్న ఈ మూవీ ఫస్ట్ రోల్ వీడియోని కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ రోల్ వీడియో అందరినీ ఎంతో ఆకట్టుకుంటుండగా, మూవీకి సంబదించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :