కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ రిలీజ్ అయ్యేది ఆరోజేనా ?

Published on Mar 10, 2023 12:21 am IST


క్రియెటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన మూవీ రంగమార్తాండ. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ప్రధాన పాత్రలు చేస్తుండగా కాలెపు మధు, వెంకట్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పాటలకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు అవి మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

మరోవైపు ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి అందించిన షాయరీ కూడా ఆకట్టుకుంది. మరాఠీ మూవీ నటసామ్రాట్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోన్న రంగమార్తాండ మూవీని మార్చి 22న ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే రిలీజ్ డేట్ కి సంబంధించి అతి త్వరలో టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

సంబంధిత సమాచారం :